అత్తను కొట్టి ఈడ్చి పారేసిన కోడలు..

|

Nov 06, 2020 | 9:18 PM

నవ మాసాలు మోసి కని పెంచిన పిల్లలు.. పెద్దలయ్యాక కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మొసలితనంలో సాయం ఉండాల్సిన కన్న బిడ్డలే పట్టించుకోకపోతే ఇక అల్లుళ్లు, కోడళ్లు పట్టించుకుంటారా.. కొందరు దుర్మార్గులు.. తల్లిదండ్రులకు సేవ చేయలేక శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అష్టకష్టాలకు గురి చేస్తుంటారు.

అత్తను కొట్టి ఈడ్చి పారేసిన కోడలు..
Follow us on

నవ మాసాలు మోసి కని పెంచిన పిల్లలు.. పెద్దలయ్యాక కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. మొసలితనంలో సాయం ఉండాల్సిన కన్న బిడ్డలే పట్టించుకోకపోతే ఇక అల్లుళ్లు, కోడళ్లు పట్టించుకుంటారా.. కొందరు దుర్మార్గులు.. తల్లిదండ్రులకు సేవ చేయలేక శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అష్టకష్టాలకు గురి చేస్తుంటారు. వారు కూడా ఒకనాటికి ముసలితనానికి చేరుకుంటామన్న విషయం మరిచి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. కాలు కదపలేని వయోభారం.. సాయం లేకుండా అడుగు వేయలేని దుస్థితి.. అలాంటి పెద్దావిడ పట్ల కనికరం కూడా లేకుండా, వృద్ధురాలైన తన అత్త పట్ల దాష్టీకంగా ప్రవర్తించిందో కోడలు. ఇష్టారీతిన కొట్టడమే కాకుండా.. ఇంట్లో నుంచి ఆమెను బయటకు ఈడ్చిపారేసింది. ఈ హృదయవిదాకర ఘటన హర్యానా రాష్ట్రంలో వెలుగు చూసింది.

హర్యానాలోని సోనిపేట్‌ ప్రాంతానికి చెందిన 82 ఏళ్ల అత్తను ఓ కోడలు దారుణంగా కొడుతూ, ఈడ్చుకెళ్తూ, నానా హింసలకు గురి చేస్తున్న హృదయ విదారక దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ తంతునంతా అక్కడే ఉన్న పిల్లలు వీడియో తీశారు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ కోడలు చేసిన దాష్టీకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ ఘటనను చూసిన నెటిజన్లు కోడలి కర్కశత్వాన్ని ఎండగడుతున్నారు. నాగరిక సమాజంలో ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించం. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వృద్ధురాలిని రక్షించి.. ఆ కోడలును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.