ఇకపై ఆన్‌లైన్ డిగ్రీ.. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!

Educational Budget 2020-21: కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఆర్ధిక సంవత్సరం 2020-21గానూ యూనియన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో విద్యారంగానికి రూ.99,300 కోట్లను కేటాయించారు. అంతేకాక పేద విద్యార్థులకు సీతమ్మ గొప్ప శుభవార్తను అందించారు. నూతన విద్యావిధానం ద్వారా ఇక నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌లోనే చదువుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. అయితే ఈ డిగ్రీ విధానానికి కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పుకొచ్చారు. దేశంలో పేరుపొందిన 100 జాతీయ విద్యాలయాల్లో మాత్రమే ఈ కోర్సును […]

ఇకపై ఆన్‌లైన్ డిగ్రీ.. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం!

Educational Budget 2020-21: కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఆర్ధిక సంవత్సరం 2020-21గానూ యూనియన్ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో విద్యారంగానికి రూ.99,300 కోట్లను కేటాయించారు. అంతేకాక పేద విద్యార్థులకు సీతమ్మ గొప్ప శుభవార్తను అందించారు. నూతన విద్యావిధానం ద్వారా ఇక నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌లోనే చదువుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు.

అయితే ఈ డిగ్రీ విధానానికి కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్పుకొచ్చారు. దేశంలో పేరుపొందిన 100 జాతీయ విద్యాలయాల్లో మాత్రమే ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు జాతీయ పోలీస్, ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అటు భారత్‌లో చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ‘స్టడీ ఇన్ ఇండియా’ అనే పేరుతో నూతన ప్రోగ్రాంను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. కాగా, విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

Published On - 1:24 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu