ED Against Amazon, Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాక్ ఇచ్చిన కేంద్రం.. చట్టాలను ఉల్లంఘించాయని..

|

Dec 31, 2020 | 7:27 PM

ED Act Against Ecommerce Sites: ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలని..

ED Against Amazon, Flipkart: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాక్ ఇచ్చిన కేంద్రం.. చట్టాలను ఉల్లంఘించాయని..
Follow us on

ED Act Against Ecommerce Sites: ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. అమేజాన్, ఫ్లిప్‌కార్ట్‌లపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం.. ఎన్‌ఫోర్స్ డైరెక్టర్ (ఈడీ)తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లను ఆదేశించింది. ఈ రెండు సంస్థలు ఎఫ్‌డీఐ పాలసీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999 (ఫెమా)ను ఉల్లంఘించాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలోనే సీఏఐటీ ఫిర్యాదును ఆధారం చేసుకొని కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే వివిధ కంపెనీలకు ఇ-కామర్స్ కంపెనీలకు మధ్య జరిగిన ఒప్పందలో బ్రాండ్ రిటైలింగ్ పేరుతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ చట్టాలను ఉల్లంఘించాయాని తెలుపుతూ.. సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భార‌తీయ‌, సెక్రటరీ జ‌న‌ర‌ల్ ప్రవీన్ ఖండేల్‌వాల్ ఈడీ, ఆర్‌బీఐకి ఇచ్చిన స‌మాచారంలో పేర్కొన్నారు.

Also Read: అమెరికాలో కోవిడ్ 19 విజృంభణ, ఒక్క రోజులో సుమారు 4 వేల మంది మృతి, ఇంకా ముప్పు ఉందంటున్న నిపుణులు