ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం…150 డివిజన్లకు 31 మందిని పర్యవేక్షకులను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ

|

Dec 02, 2020 | 7:32 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనుంది. గ్రేటర్ పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఈనెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు పర్యవేక్షకులను తెలంగాణ ఎన్నికల కమిషన్...

ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధం...150 డివిజన్లకు 31 మందిని పర్యవేక్షకులను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగనుంది. గ్రేటర్ పోలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఈనెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపును పర్యవేక్షించేందుకు పర్యవేక్షకులను తెలంగాణ ఎన్నికల కమిషన్ నియమించింది. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖ నుంచి 31 మందిని పర్యవేక్షకులుగా నియమిస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి అశోక్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపును ఆయా వార్డులు, సర్కిల్‌ కార్యాలయాల్లో పర్యవేక్షించే అధికారులు పరిశీలిస్తారు.

ఎన్నికల కమిషన్‌ ఆధ్వర్యంలో పనిచేసే వీరంతా ఎన్నికల కమిషన్‌ ప్రతినిధులుగా ఓటింగ్‌ జరిగే ప్రదేశాల్లో పనిచేస్తారు. లెక్కింపు ప్రక్రియలో క్రమశిక్షణ పాటించడం, గొడవలు కాకుండా నియంత్రించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షకులుగా నియమితులైన వారితో ఎన్నికల కమిషనర్‌ గురువారం ఉదయం 11గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈసమావేశంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా జరిగేందుకు వారి విధులను, బాధ్యతలకు సంబంధించి అంశాలను వివరించనున్నారు.