Chocolate Butter Cookies: కుకీస్ ని పిల్లల నుంచి పెద్దలవరకూ ఇష్టంగా తింటారు. దీంతో ఈ కుకీస్ ను బేకరీలో కానీ ఇన్స్టెంట్ గా కానీ కొనుక్కుని తింటారు. అయితే ఈ కుకీస్ ని ఈజీగా బేకరీ టెస్ట్ తో సమానంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈరోజు చాక్లెట్ బట్టర్ కుకీస్ తయారీ విధానం తెలుసుకుందాం..
మైదా -200 గ్రాములు
పంచదార పొడి -100గ్రాములు ‘
వెన్న- 100 గ్రాములు
మైదా -200గ్రాములు
కొంచెం నెయ్యి
గార్నిష్ కోసం
జీడిపప్పు బాదం చిన్న చిన్న ముక్కలు
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో వెన్న, పంచదార పొడి వేసుకోవాలి.. తర్వాత పంచదార కరిగేవరకూ వెన్న, పంచదారను కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో మైదా వేసి.. ఉండలు లేకుండా స్మూత్ గా వచ్చేవరకూ బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కవర్ చేస్తూ ఓ=గిన్నె పై ఒక మూత పెట్టి… ఫ్రిడ్జ్ లో ఒక 15 నిముషాలు ఉంచాలి.
అనంతరం ఈ మైదా మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసుకుని.. పిండిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అనంతరం ఈ ఉండలను చిన్న చిన్న చపాతీల్లా ఒత్తుకోవాలి.. తర్వాత మీకు నచ్చిన షేప్ లో ఆ చపాతీలను కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చపాతీలపై బాదం, జీడిపప్పు ముక్కలతో వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అనంతరం ఒక బేకింగ్ ట్రే తీసుకుని నెయ్యి రాసి.. ఆ ట్రే లో గార్నిష్ చేసుకున్న ముక్కలను వరసగా పేర్చుకోవాలి.. అనంతరం ఈ ట్రే ను ఒవేన్ లో పెట్టి.. 200 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద, 10 నిముషాలు ఉంచి బేక్ చేసుకోవాలి. బేక్ అయిన తరవాత ఈ కుకీస్ ను బయటకు తీసుకుని .. వాటి మీద ఇష్టమైనవారు చాక్లెట్ క్రీమ్ ను వేసుకోవచ్చు.. అంతే బేకరీ స్టైల్ లో ఎంతో రుచికరమైన చాక్లెట్ బట్టర్ కుకీస్ రెడీ..
Also Read: Krishna kamal: మొత్తం మాభారతాన్ని ఆవిష్కరించే కౌరవపాండవ పుష్పం.. ఈ పువ్వు గురించి అనేక జానపద కథలు