దివీస్‌ ల్యాబ్‌పై దాడి కేసులో వేగం పెంచిన పోలీసులు..160 మందిపై కేసులు..36 మంది అరెస్ట్..ఇందో ఓ ట్విస్ట్

|

Dec 19, 2020 | 5:03 PM

తూర్పుగోదావరి జిల్లా తొండగిలో దివీస్‌ ల్యాబ్‌పై జరిగిన దాడుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఫ్యాక్టరీపై దాడి చేసి తగలబెట్టిన ఘటనలో మొత్తం 160 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 36 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు..

దివీస్‌ ల్యాబ్‌పై దాడి కేసులో వేగం పెంచిన పోలీసులు..160 మందిపై కేసులు..36 మంది అరెస్ట్..ఇందో ఓ ట్విస్ట్
Follow us on

తూర్పుగోదావరి జిల్లా తొండగిలో దివీస్‌ ల్యాబ్‌పై జరిగిన దాడుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఫ్యాక్టరీపై దాడి చేసి తగలబెట్టిన ఘటనలో మొత్తం 160 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 36 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.

అయితే.. ఈ దాడులతో సంబంధం లేని వారిని అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు స్థానికులు. ఇళ్ల దగ్గర ఉన్నవాళ్లను బలవంతంగా తీసుకెళ్లారని.. వాళ్ల ఆచూకీ కూడా చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళనలకు దిగారు.. దివీస్ ఫ్యాక్టరీని వ్యతిరేకించడం వల్లే తమను వేధిస్తున్నారంటున్నారు మహిళలు..

అయితే.. పోలీసులు మాత్రం మహిళల ఆరోపణలను ఖండిస్తున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో దాడికి పాల్పడ్డ వారిపై మాత్రమే కేసులు పెట్టామంటున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంది కాబట్టి. .ఎలాంటి సమావేశాలు పెట్టడానికి వీల్లేదంటున్నారు.