చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు.. రామసముద్రం మండలంలో ఇళ్ల నుంచి జనం భయంతో పరుగులు

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మూడుసార్లు భూమి కంపించింది. రామసముద్రం మండలం కాప్పలి, బైరాజుపల్లిలో ఈరాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు..

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు.. రామసముద్రం మండలంలో ఇళ్ల నుంచి జనం భయంతో పరుగులు

Updated on: Nov 30, 2020 | 10:51 PM

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మూడుసార్లు భూమి కంపించింది. రామసముద్రం మండలం కాప్పలి, బైరాజుపల్లిలో ఈరాత్రి భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు తీశారు. ప్రకంపనలకు – ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పాడ్డాయి. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు.

తాజాగా, నివర్ తుఫాన్ కారణంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో నీరు భూమి లోపలి పొరలకు ఇంకి ఉంటుందనే ఈ కారణంతోనే భూ ప్రకంపనలు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు.