న్యూఢిల్లీ : నికోబార్ దీవుల్లో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదు అయ్యింది. ఇవాళ ఉదయం 4.44 నిమిషాలకు ప్రకంపనలు నమోదు అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫిబ్రవరి 28న కూడా నికోబార్ దీవుల్లో 4.8 తీవ్రతతో భూమి కంపించింది. మార్చి 23వ తేదీన కూడా పది నిమిషాల వ్యవధిలోనే అండమాన్ దీవుల్లో 5.1 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది.