దేశంలో గత కొద్దిరోజులుగా పలు చోట్ల తరచూ భూకంపాలు కలవరాన్ని కలిగిస్తున్నాయి. మంగళవారం ఉదయం లదాక్, అండమాన్-నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. లదాక్‌లో భూకంప తీవ్రత 4.4గా నమోదు కాగా, అండమాన్-నికోబార్ దీవుల్లో 4 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. అయితే ఇప్పటి వరకూ ఈ రెండు ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు.
Earthquake hits Kargil, Ladakhhttps://t.co/UUx3amTKFm
— India TV (@indiatvnews) September 8, 2020
ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అండమాన్- నికోబార్ దీవుల్లో మరోమారు భూకంపం సంభవించింది. డిగలీపూర్‌లో భూ ప్రకంపనలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, లదాక్‌లోని కార్గిల్‌కు 435 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉదయం 5. 47 గంటలకు భూమి కంపించింది. ఈ రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పటికీ ఎటువంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదన్నారు అధికారులు. కాగా, గత కొద్దిరోజులుగా ఈశాన్య భారతంలోని మిజోరం, నాగాలాండ్ ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ముంబైకి సమీపంలోనూ, నాసిక్, డయ్యూ ప్రాంతాల్లోనూ భూమి కంపింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు.