ఏపీలో 37 మంది డిఎస్పీలకు స్ధానచలనం

| Edited By:

Jun 28, 2019 | 3:28 PM

ఏపీలో ఒకేసారి 37 మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా పెద్దఎత్తున వీరంతా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన 30 మంది మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ తెలిపారు. ఇదిలాఉంటే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన అధికారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారనే ఆరోపణలున్నాయి. అందువల్లే కొంతమంది పోలీస్ అధికారులు టీడీపీ నేతల అడుగుజాడల్లో నడిచినట్టుగా […]

ఏపీలో 37 మంది డిఎస్పీలకు స్ధానచలనం
Follow us on

ఏపీలో ఒకేసారి 37 మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా పెద్దఎత్తున వీరంతా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన 30 మంది మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ తెలిపారు.

ఇదిలాఉంటే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన అధికారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారనే ఆరోపణలున్నాయి. అందువల్లే కొంతమంది పోలీస్ అధికారులు టీడీపీ నేతల అడుగుజాడల్లో నడిచినట్టుగా విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్ధను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే డీజీపీ బదిలీలపై ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో మరికొంతమందికి కూడా స్ధానచలనం కలిగే అవకాశాలున్నట్టుగా సమాచారం.