DSP Musical New Year Wishes : సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అభిమానుల కోసం కొత్త పాటను అందించనున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు దేవి. తనకెంతో ఇష్టమైన వాయిద్యం సితార్ అని తెలిపిన ఈ సంగీత సంచలనం.. ప్రముఖ సితార్ ప్లేయర్ కిషోర్‌ను పరిచయం చేశారు. ఇక తన తర్వాతి చిత్రం రంగ్‌దేలోని ఓ పాటకు కిషోర్ సితార్ వాయించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మీ అందరి కోసం ఒక చిన్న మ్యూజికల్ వీడియో.. వచ్చే ఏడాది అందమైన సంగీతం, అద్భుతమైన ఆశలు, ప్రేమతో రంగులమయం కావాలంటూ’ క్యాప్షన్ రాసుకొచ్చారు.
A small MUSICAL VIDEO for all of you..
To Step into a BEAUTIFUL MUSICAL NEW YEAR filled with AMAZING HOPE??.. LOVE❤️& COLOURS..?#RangDe#RangDeRecordingSession#HappyNewYear2021 https://t.co/sBBEtdjEFs— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 31, 2020
ఇక ఈ పూర్తి పాటను జనవరి1న న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయనున్నట్లు దేవీ శ్రీ తెలిపారు. ఇదిలా ఉంటే నితిన్, కీర్తీ సురేష్ జంటగా రంగ్‌దే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.