పసిఫిక్ మహాసముద్రంలో.. సబ్-మెరైన్ పైకి దూకి..

| Edited By: Srinu

Jul 12, 2019 | 4:42 PM

‘ డూ యు బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేవరీ ‘ (ఇలాంటి సాహస కృత్యాన్ని మీరు నమ్ముతారా ? ) అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ లో ట్వీట్ చేశారు. ఆయనను అంత ఇంప్రెస్ చేసిన ఆ సాహస కృత్యమేమిటి ? అదేమిటో తెలుసుకోవాలంటే.. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతానికి వెళ్లాల్సిందే..! అక్కడ కోట్లాది డాలర్ల విలువైన డ్రగ్ (17 వేల పౌండ్ల కొకైన్) ని స్మగ్లర్లు..సముద్రంలో ఓ జలాంతర్గామిలో తరలిస్తున్న దృశ్యాన్ని […]

పసిఫిక్ మహాసముద్రంలో.. సబ్-మెరైన్ పైకి దూకి..
Follow us on

‘ డూ యు బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేవరీ ‘ (ఇలాంటి సాహస కృత్యాన్ని మీరు నమ్ముతారా ? ) అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ లో ట్వీట్ చేశారు. ఆయనను అంత ఇంప్రెస్ చేసిన ఆ సాహస కృత్యమేమిటి ? అదేమిటో తెలుసుకోవాలంటే.. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతానికి వెళ్లాల్సిందే..! అక్కడ కోట్లాది డాలర్ల విలువైన డ్రగ్ (17 వేల పౌండ్ల కొకైన్) ని స్మగ్లర్లు..సముద్రంలో ఓ జలాంతర్గామిలో తరలిస్తున్న దృశ్యాన్ని చూశారు యుఎస్ కోస్ట్ గార్డులు..అంతే ! అతి వేగంతో దూసుకుపోతున్న ఆ సబ్-మెరైన్ ని తమ బోటులో వెంబడించారు. కటర్ మున్రో అనే గార్డు.. తమ పడవ దాన్ని సమీపిస్తుండగా అత్యంత సాహసంగా బోటునుంచి దానిపైకి జంప్ చేసి దానిపై నున్న ‘ హ్యాచ్ ‘ (మూతవంటి భాగాన్ని) ఓపెన్ చేశాడు. ఆ సందర్భంలో ఏమాత్రం పట్టు తప్పినా, జారినా.. కటర్ లోతైన సముద్ర జలాల్లో పడిపోయి ఉండేవాడే ! తన ప్రాణాలు పోగొట్టుకునేవాడే ! కానీ వాటిని అతగాడు లెక్క చేయలేదు. మొత్తానికి ఆ డ్రగ్ స్మగ్లర్ల భరతం పట్టాడు. కొకైన్ తో నిండిన ఆ సబ్-మెరైన్ లో అయిదుగురు స్మగ్లర్లు ఉన్నారు. సముద్ర జలాల్లో వేగంగా వెళ్తున్న జలాంతర్గామిని ఎవరూ అనుమానించలేరన్న ధీమాతో వెళ్తున్న స్మగ్లర్ల ఆట కట్టయింది. సినీ ఫక్కీలో ఈ ఛేజింగ్ జరిగింది. గత జూన్ 18 న జరిగిన ఈ ఘటన తాలూకు నిముషమున్నర నిడివి గల వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ కొకైన్ అంతర్జాతీయ మార్కెట్లో 232 మిలియన్ యుఎస్ డాలర్ల విలువ చేస్తుందని అంచనా.. మెక్సికో, సెంట్రల్, సౌత్ అమెరికా ప్రాంతాల్లో జలాంతర్గాముల ద్వారా స్మగ్లర్లు ఇలా డ్రగ్స్ ని దొంగచాటుగా తరలిస్తుంటారు. వీరికి ఆయా చోట్ల పెద్ద రాకెట్ ముఠాలే ఉన్నాయి. ఏమైనా.. ఈ లేటెస్ట్ వీడియో చూసిన ట్రంప్..ఆ సాహస నేవీ కోస్ట్ గార్డును ప్రశంలతో ముంచెత్తాడు.