రేపటి నుంచి ఢిల్లీలో డీజిల్ జనరేటర్లపై నిషేధం..!

పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణకు దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ జనరేటర్లను నిషేధం విధించారు.

రేపటి నుంచి ఢిల్లీలో డీజిల్ జనరేటర్లపై నిషేధం..!
Follow us

|

Updated on: Oct 14, 2020 | 7:32 PM

పర్యావరణ కాలుష్య నివారణ, నియంత్రణకు దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ జనరేటర్లను నిషేధం విధించారు. ఢిల్లీలో గురువారం నుంచి డీజిల్ జనరేటర్లను వినియోగించేందుకు అనుమతి లేదు. వాయు కాలుష్య నివారణ కోసం వీటి వాడకంపై ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి నిషేధం విధించింది. గ్రేడెడ్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అత్యవసర సేవల కోసం వినియోగించేందుకు మాత్రం అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు.

డీజిల్, పెట్రోలు, కిరోసిన్‌లతో నడిచే అన్ని కెపాసిటీల జనరేటర్ల వాడకాన్ని అక్టోబరు 15 నుంచి నిషేధిస్తున్నట్లు డీపీసీసీ పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. గ్రేడెడ్ రెస్సాన్స్ యాక్షన్ ప్లాన్‌ను ఢిల్లీ, దాని పరిసరాల్లోని పట్టణాల్లో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2017లో పర్యావరణం, అడవుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన పర్యావరణ కాలుష్య నిరోధం, నియంత్రణ వ్యవస్థ దీనిని అమలు చేస్తోంది.

మెట్రో రైల్ సేవలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, రైల్వే సేవలు, విమానాశ్రయాలు, అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్స్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నడుపుతున్న డేటా సెంటర్ అత్యవసర సేవల పరిథిలోకి వస్తాయని ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కౌన్సిల్ వివరించింది.

Latest Articles
తక్కువ ధరలో అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే

పుష్ప ఫస్ట్ సాంగ్ రికార్డ్ బద్దలు.| మంచి గోస్ట్ తో వెన్నెల కిషోర్

ఊహకందని డిస్కౌంట్‌.. రూ. 38 వేలకే ఫోల్డబుల్ ఫోన్‌

తెలంగాణలో పెరిగిన డేటింగ్ యాప్ నేరాలు.. ఎక్కువ బాధితులు వీరే

బాబోయ్‌.. బిర్యానీలో పిల్లి మాంసం వాడుతున్నారా..? వీడియో చూస్తే

చాలా ఈజీ.. వార్నర్‌ కు పుష్పరాజ్ టిప్స్.! | బాహుబలి ఆగమనం..

న్యూఢిల్లీలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..

ఆ స్పెషల్ పర్సన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన ఎంఎస్ ధోని

మనం తినే పన్నీర్ అసలీయా.. నకిలీయా.. ఇంట్లో ఇట్టే గుర్తించవచ్చు..

రూ. 90 వేల ఫోన్‌ను.. రూ. 45వేలకే సొంతం చేసుకునే ఛాన్స్‌

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు

రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్

ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..

'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్

పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా

కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??

పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??

క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??

బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్