సన్ ఫ్లవర్ తిరగడంలో ఉన్న సీక్రెట్ ఇదే!

| Edited By:

Feb 09, 2020 | 2:22 PM

పొద్దు తిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్‌) దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్యుడు ఎటు తిరిగితే.. అటు తిరుగుతూ ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కానీ ఎందుకు అలా తిరుగుతుందని? చాలా మందిలో ఈ ప్రశ్న మెదిలే ఉంటుంది. అలా అది సూర్యుడివైపు తిరగడంలో ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు కొందరు శాస్త్రవేత్తలు. ఈ ఫ్లవర్ చాలా ఫేమస్ కూడా. ఈ పొద్దు తిరుగుడు పువ్వుతో చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా సన్‌ ఫ్లవర్ […]

సన్ ఫ్లవర్ తిరగడంలో ఉన్న సీక్రెట్ ఇదే!
Follow us on

పొద్దు తిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్‌) దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్యుడు ఎటు తిరిగితే.. అటు తిరుగుతూ ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కానీ ఎందుకు అలా తిరుగుతుందని? చాలా మందిలో ఈ ప్రశ్న మెదిలే ఉంటుంది. అలా అది సూర్యుడివైపు తిరగడంలో ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు కొందరు శాస్త్రవేత్తలు. ఈ ఫ్లవర్ చాలా ఫేమస్ కూడా. ఈ పొద్దు తిరుగుడు పువ్వుతో చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా సన్‌ ఫ్లవర్ ఆయిల్ చాలా ఫేమస్. సౌందర్య సాధనాలు, చర్మ రక్షణకు సంబంధించిన కొన్ని మెడిసిన్స్‌లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ ‘ఇ’ కోలన్ క్యాన్సర్, డయాబెటిక్ రిస్క్ నుంచి కాపాడుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా దీనిలో 30 రకాల జాతులు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న మ్యాజిక్ ఏంటంటే.. సూర్యుడి కదలికలను బట్టి ఎటు తిరిగితే.. అటు తిరిగే ఈ ఫ్లవర్‌లోని సీక్రెట్‌ని కనిపెట్టారు శాస్త్రవేత్తలు. వృక్ష శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో పొద్దుతిరుగుడు పువ్వుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిశాయి.

పొద్దు తిరుగుడు పువ్వు కాడల్లోని మూలకణాల ప్రత్యేక ఎదుగుదలనే ఇందుకు అసలైన కారణమని వారు అంటున్నారు. కాడల్లో పగటి పూట తూర్పు వైపున్న మూలకణాలు పెరగడంతో, పువ్వు అటువైపు తిరిగి అంటే సూర్యుడి ఉండే వైపునకు వంగిపోతుంది. పువ్వు ఉష్ణోగ్రతను గ్రహించడం కారణంగా ఇలా జరుగుతుందని వారు తేల్చారు.