Dhoni Set New Record In Instagram: తనదైన ఆటతీరుతో క్రికెట్ ప్రపంచంలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదిచున్నాడు ధోనీ. ఇక గ్రౌండ్‌లో సిక్సర్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మిస్టర్ కూల్ ఇప్పుడు నెట్టింట్లోనూ సందడి చేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధోనీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాలో 30 మిలియన్ల ఫాలోవర్లు సాధించిన రెండో క్రికెటర్‌గా ధోనీ సరికొత్త రికార్డు సృష్టించారు. మొదటి స్థానంలో 88 మిలియన్ల ఫాలోవర్లతో టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లి మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ రెండో స్థానంలో నిలిచాడు.
ఈ క్రమంలోనే ధోనీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఓ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాంచీ శివారుల్లో ధోనీకి 43 ఎకరాల ఫామ్ హౌజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ధోనీ 10 ఎకరాల్లో పంటలను పండిస్తున్నారు. తాజాగా తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఓ వీడియోను ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఫామ్ హౌజ్‌లో పండిస్తోన్న స్ట్రాబెరీని తింటున్న సమయంలో తీసిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘నా పొలంలోని స్ట్రాబెరీలను నేను తినడం మొదలుపెడితే మార్కెట్‌కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు’ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. ధోనీ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోను 70 లక్షలమందికిపైగా వీక్షించడం విశేషం. ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని.. ఐపీఎల్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
Also Read: టీమిండియాపై క్వీన్స్‌ల్యాండ్ ఆరోగ్య మంత్రి అనుచిత వ్యాఖ్యలు… రాస్ బేట్స్‌పై బీసీసీఐ ఆగ్రహం