ధరణి‌పై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందన్న ఏజీ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై ఉన్న స్టే ను హైకోర్టు పొడిగించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు,..

ధరణి‌పై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందన్న ఏజీ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

Updated on: Jan 22, 2021 | 5:19 PM

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై ఉన్న స్టే ను హైకోర్టు పొడిగించింది. వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టే ను జూన్‌ 21 కు ఎక్స్‌టెన్డ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ధరణి పోర్టల్‌కు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. ఒకే అంశంపై పలు పిటిషన్లు దాఖలు కావడంతో.. అందులో ఐదు పిటిషన్లను తోసిపుచ్చి మిగతా రెండింటిని విచారణకు స్వీకరించింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న హైకోర్టు, ధరణిపై రెండు పిల్స్‌పై మాత్రమే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందని, ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ కోర్టుని కోరారు. ఏజీ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం గతంలో ఇచ్చిన స్టేను జూన్‌ 21 వరకు పొడిగిస్తూ కేసు విచారణ వాయిదా వేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us