
ఆడపిల్లల భవిష్యత్ బంగారుమయం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2015లో సుకన్య సమృద్ది యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు రూ.250 నుంచి..రూ.1,50,000 వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నా.. సుకన్య స్కీమ్‌కు అర్హులవుతారు. అయితే ఒక్కోసారి కవల పిల్లలు పుట్టిన నేపథ్యంలో గరిష్ఠంగా ఒక కుటుంబం నుంచి ముగ్గురు ఆడపిల్లలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందవచ్చు. సాధారణ పొదుపు పథకాల కంటే సుకన్య స్కీమ్‌కు చాలా ఎక్కువ వడ్డీని బ్యాంకులు జమచేస్తాయి. సదరు ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత అకౌంట్‌లో ఉన్న మొత్తంలో 50 శాతం..వారి హైయ్యర్ స్టడీస్ కోసం, మ్యారేజ్ కోసం విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. 21 ఏళ్లు నిండిన తర్వాత పూర్తి నగదును తీసుకునే సౌలభ్యం ఉంది.