కరోనా కేర్ సెంట‌ర్‌ గా.. కామన్వెల్త్ గేమ్స్ స్టేడియం..  

| Edited By:

Jul 02, 2020 | 9:47 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బాధితుల కోసం ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ స్టేడియంలో 600 పడకలతో కోవి‌డ్‌-19 సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

కరోనా కేర్ సెంట‌ర్‌ గా.. కామన్వెల్త్ గేమ్స్ స్టేడియం..  
Follow us on

Delhi’s Commonwealth Games Stadium: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో బాధితుల కోసం ఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ స్టేడియంలో 600 పడకలతో కోవి‌డ్‌-19 సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత దేశంలో అత్యధిక కరోనా కేసులు ఢిల్లీలో ఉన్నాయి. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 87,000 దాటింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈ కేంద్రాన్ని సందర్శించారు.

కరోనా కట్టడికోసం సీఎం కేజ్రీవాల్ పలు చర్యలు చేపట్టారు. ఈ కరోనా సంరక్షణ కేంద్రంలో 600 పడకలు ఉంటాయ‌ని, వాటిలో 200 ప‌డ‌క‌లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సిద్ధం చేశార‌ని సీఎం తెలిపారు. ఈ సంరక్షణ కేంద్రంలో మొత్తం 80 మంది వైద్యులు, 150 మంది నర్సులు అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. ఇంటెన్సివ్ కేర్ అవసరమయ్యే బాధితులకు ఈ ఆసుపత్రుల‌లో చికిత్స అందిస్తార‌ని తెలిపారు.

Also Read: అసోంలో వరద బీభత్సం.. 33కు పెరిగిన మృతుల సంఖ్య..