
Delhi Corona Report : దేశ రాజధాని ఢిల్లీని కరోనా వీడటం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ఢిల్లీ మహానగరం వణికిపోతోంది. ఒక్కరోజే రికార్డుస్థాయిలో సుమారు 7 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 6,842 కరోనా కేసులు నమోదయ్యాయి.
దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,09,938కు చేరింది. ఈ 24 గంటల్లో 51 మంది కరోనాతో మృతి చెందగా… మొత్తం మరణాల సంఖ్య6,703కు పెరిగింది. గత 24 గంటల్లో 5,797 మంది కొలుకుని డిచ్చర్జి అయ్యారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య 3,65,866కు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 37,369 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు ఢిల్లీలో మూడోసారి కరోనా విజృంభణ మొదలైందని, గత కొన్ని రోజులుగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తున్నదని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.