కోవిద్ 19 మహమ్మారి దేశంలో విలయతాండవం చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 500కు పైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం పంగడలాంటి వార్త మోసుకొచ్చింది. గత 40 గంటల్లో ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా ప్రకటించారు. ఢిల్లీలో మొత్తం 30 కరోనా కేసుల్లో 23 మంది కోలుకుని తమతమ ఇళ్లకు చేరుకున్నారని ఆయన తెలిపారు. గత 24 గంటల్లో కరోనా కేసులేవీ నమోదు కాలేదని ఇంతకుమునుపే ప్రకటించిన కేజ్రీవాల్.. తాజాగా మరో గుడ్ న్యూస్‌తో ముందుకొచ్చారు.