ఢిల్లీలో ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి..!

|

Jun 19, 2020 | 10:45 PM

దేశ రాజధాని డిల్లీలొ కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని 5 రోజుల పాటు ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ ను తప్పనిసరి చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఢిల్లీలో ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరి..!
Follow us on

దేశం రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కరోనా లక్షణాలు తక్కువగా ఉండి పాజిటివ్ వచ్చిన వారికి, లక్షణాలే లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి 5 రోజుల ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ ను తప్పనిసరి చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఇలా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ కి మాత్రమే పరిమితం చేస్తూ.. వైద్య సేవలు అందిస్తోంది ఢిల్లీ సర్కార్. హోం క్వారంటైన్ ఉన్న కొవిడ్ పేషెంట్లు నిబంధనలు సరిగా పాటించక పోవడంతో ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో కొవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరిని 5 రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్ ను తప్పనిసరి చేసింది. ఢిల్లీలో ప్రస్తుతం దాదాపు 8,500 మంది కరోనా పేషంట్లు హోం క్వారంటైన్ లో చికిత్సపొందుతున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో వారందరినీ ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లకు తరలించనున్నారు. అయితే.. ఈ నిర్ణయం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విముఖత ఉన్నట్లు సమాచారం.