ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌ ప్రకటనలపై హైకోర్టు సీరియస్..!

ఉద్యోగ ప్రకటనలతో ఔత్సాహికులను ఆకర్షిస్తున ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌లు తమ వెబ్‌సైట్లలో రిలయన్స్‌ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిడెట్‌లను ఆదేశించింది. జియో జాబ్స్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌ జాబ్స్‌ అనే వర్డ్స్‌ను ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (RIL) న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఆర్‌ఐఎల్‌కు […]

ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌ ప్రకటనలపై హైకోర్టు సీరియస్..!

Updated on: May 29, 2020 | 7:05 PM

ఉద్యోగ ప్రకటనలతో ఔత్సాహికులను ఆకర్షిస్తున ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌లపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌లు తమ వెబ్‌సైట్లలో రిలయన్స్‌ జియో పేరిట నకిలీ ఉద్యోగ ప్రకటనలు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు దూరంగా ఉండాలని ఒఎల్‌ఎక్స్‌, క్వికర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిడెట్‌లను ఆదేశించింది. జియో జాబ్స్‌, రిలయన్స్‌ ట్రెండ్స్‌ జాబ్స్‌ అనే వర్డ్స్‌ను ఉపయోగిస్తూ నకిలీ ప్రకటనలు ఇవ్వడంతో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (RIL) న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది. ఆర్‌ఐఎల్‌కు ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రాథమిక ఆధారాలు ఉన్నందున మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కోన్నారు జస్టిస్‌ ముక్తా గుప్తా. జియో, రిలయన్స్‌ ట్రేడ్‌మార్క్‌లకు తాము సొంతదారులమని ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు వ‍్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ఆర్‌ఐఎల్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.