ఢిల్లీలో కొత్తగా 1,093 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే 1,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,34,403కి చేరుకుంది.

ఢిల్లీలో కొత్తగా 1,093 పాజిటివ్ కేసులు

Updated on: Jul 30, 2020 | 9:59 PM

దేశంలో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్కరోజే 1,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ఢిల్లీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,34,403కి చేరుకుంది. నిత్యం పెరగుతున్న కేసులసంఖ్య దేశ రాజధాని ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 29 మంది కరోనా వల్ల మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఢిల్లీ వ్యాప్తంగా 10,743 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,19,724 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇక ఇప్పటి వరకు ఢిల్లీ వ్యాప్తంగా మొత్తంగా 3,936 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

Loading...
Unable to load recommendations.
Follow Us