కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో డిగ్రీ షెడ్యూల్.. ఆగస్టు 20 తర్వాత పరీక్షలు..

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాల పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్‌ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి

కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో డిగ్రీ షెడ్యూల్.. ఆగస్టు 20 తర్వాత పరీక్షలు..

Updated on: Jul 25, 2020 | 9:40 PM

Degree schedule: దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాల పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో కోర్టు ఆదేశిస్తే రెండు వారాల్లో పరీక్షల షెడ్యూల్‌ ఖరారు చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలకు సంబంధించి కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే రెండు వారాల్లో షెడ్యూల్‌ ఖరారు చేసి ఆగస్టు 20 తర్వాత పరీక్షలను నిర్వహిస్తామన్నారు.

తొలుత ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలను నిర్వహిస్తామని, మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి ఇప్పటికే పైతరగతికి ప్రమోట్‌ చేసినట్లు తెలిపారు. అకడమిక్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!

Loading...
Unable to load recommendations.
Follow Us