అపాలజీతో సరి, బీజేపీ నేతపై కేసుకు స్వస్తి

| Edited By: Anil kumar poka

Oct 29, 2020 | 6:20 PM

ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ప్రకటించడంతో ఆయనపై దాఖలైన క్రిమినల్ డిఫమేషన్ (పరువునష్టం) కేసును ఢిల్లీ కోర్టు  క్లోజ్ చేసేసింది.

అపాలజీతో సరి, బీజేపీ నేతపై కేసుకు స్వస్తి
Follow us on

ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా ప్రకటించడంతో ఆయనపై దాఖలైన క్రిమినల్ డిఫమేషన్ (పరువునష్టం) కేసును ఢిల్లీ కోర్టు  క్లోజ్ చేసేసింది. తనపైన, సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన 2017 లో కపిల్ మిశ్రా ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ  జైన్ ఆయనమీద కోర్టులో  డిఫమేషన్ దావా వేశారు. అయితే బేషరతుగా అపాలజీ చెబుతానని మిశ్రా గురువారం కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసుకు స్వస్తి చెబుతున్నట్టు మేజిస్ట్రేట్ విశాల్ ప్రకటించారు..

అరవింద్ కేజ్రీవాల్ కు జైన్ రూ. 2 కోట్ల లంచం ఇచ్చారని, కేజ్రీవాల్  బంధువుతో ఆయన 50 కోట్ల విలువైన భూ లావాదేవీని సెటిల్ చేసుకున్నారని కపిల్ మిశ్రా 2017 లో ఆరోపించారు. పైగా జైన్ జైలుకు వెళ్లడం ఖాయమని కూడా నాడు వ్యాఖ్యానించారు. దీంతో జైన్ ఈయనమీద పరువునష్టం దావా వేశారు.