బార్బీడాల్‌గా పద్మావత్..ఆకర్షిస్తోన్నదీపిక బొమ్మలు

|

Mar 06, 2020 | 9:55 AM

పద్మావ‌తి చిత్రంలో రాణి ప‌ద్మావ‌తి పాత్ర పోషించిన దీపిక ప‌దుకొణే అభిమానుల మనుస్సులో చెరగని ముద్ర వేసుకుంది. ప‌ద్మావ‌త్ చిత్రంలో యువ‌రాణి పాత్ర పోషించిన దీపికా..

బార్బీడాల్‌గా పద్మావత్..ఆకర్షిస్తోన్నదీపిక బొమ్మలు
Follow us on

‘ఓం శాంతి ఓం’ చిత్రంతో బాలీవుడ్‌ తెరకు పరిచయమై… అనతికాలంలోనే స్టార్ హోదా కైవసం చేసుకున్న నటి దీపికా పదుకొణే. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడైన ప్రకాష్ పదుకొణే కుమార్తె అయిన దీపిక.. లవ్ ఆజ్‌కల్, హౌస్‌ఫుల్, రేస్ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ లాంటి సినిమాలతో తనకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకుంది. తన చిరకాల మిత్రుడు, ప్రేమికుడు రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకుంది.

పద్మావ‌తి చిత్రంలో రాణి ప‌ద్మావ‌తి పాత్ర పోషించిన దీపిక ప‌దుకొణే అభిమానుల మనుస్సులో చెరగని ముద్ర వేసుకుంది. ప‌ద్మావ‌త్ చిత్రంలో యువ‌రాణి పాత్ర పోషించింది. అందులో దీపికా ఒంటి నిండా న‌గ‌లు ధ‌రించి మహారాణిగా ఎంతో ఠీవీగా క‌నిపించి మెప్పించింది. అయితే ప‌ద్మావ‌త్ చిత్రంలోని దీపికా లుక్‌కి సంబంధించిన డాల్స్ ప్ర‌స్తుతం మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. పద్మావత్ డాల్స్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పద్మావతి రూపంలో ఉన్న దీపికా పదుకొణే బొమ్మల కొనుగోలుకు అభిమానులు ఎగబడుతున్నారట.