DCGI LIVE updates : కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. టీకా అందుబాటులోకి వచ్చే విషయంపై కీలక వివరాలు వెల్లడించింది. వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి నిన్న నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టీకాల రాజధానిగా హైదరాబాద్ మారుతోందని అన్నారు. ఆదివారం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషితో హైదరాబాద్‌కు ఎంతో ఖ్యాతి లభిస్తుందన్నారు.
Many Congratulations to Dr. Krishna Ella, Suchitra Ella & the entire team of scientists @BharatBiotech on getting DCGI approval for Covaxin?
Hyderabad continues to shines on as the vaccine capital because of the pursuit of excellence of scientists & innovative entrepreneurs
— KTR (@KTRTRS) January 3, 2021
భారత్‌లో కూడా టీకా అందుబాటులోకి రావడంతో కరోనాపై యద్ధం కీలక మలుపు తిరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్‌కు డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేయడంపై ప్రధాని మోదీ స్పందించారు.
We reiterate our gratitude to doctors, medical staff, scientists, police personnel, sanitation workers and all Corona warriors for the outstanding work done, that too in adverse circumstances. We will remain eternally grateful to them for saving many lives.
— Narendra Modi (@narendramodi) January 3, 2021
ఈ నిర్ణయం భారత్ ఆరోగ్యవంతమైన కొవిడ్ రహిత దేశంగా మార్చేందుకు సహకరిస్తుందని తెలిపారు. దేశప్రజలకు, వ్యాక్సిన్ అభివృద్ధిలో కృషి చేసి శాస్త్రవేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనుమతులు వచ్చిన రెండు టీకాలు భారత్‌లోనే తయారు కావడం గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు.
It would make every Indian proud that the two vaccines that have been given emergency use approval are made in India! This shows the eagerness of our scientific community to fulfil the dream of an Aatmanirbhar Bharat, at the root of which is care and compassion.
— Narendra Modi (@narendramodi) January 3, 2021
భారత శాస్త్రవేత్తలు ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేందుకు ఎంత ఉత్సాహంగా ఉన్నారో తెలియజేసేందుకు ఈ ఘటన ఉదాహరణ అని పేర్కొన్నారు.
A decisive turning point to strengthen a spirited fight!
DCGI granting approval to vaccines of @SerumInstIndia and @BharatBiotech accelerates the road to a healthier and COVID-free nation.
Congratulations India.
Congratulations to our hardworking scientists and innovators.
— Narendra Modi (@narendramodi) January 3, 2021
కొవాగ్జిన్ తయారీని ఇప్పటికే భారత్ బయోటెక్ చేపట్టింది. కోటి డోసులు ఉత్పత్తయ్యాయి. తుది అనుమతి రాగానే వీటిని పంపిణీ చేస్తారు. కంపెనీకి ఏటా 30 కోట్ల డోసుల టీకా తయారీ సామర్థ్యం ఉంటుంది. అవసరాన్ని బట్టి అదనపు సామర్థ్యాన్ని సమకూర్చుకోవటానికీ కంపెనీ సిద్ధంగా ఉంది. ఇంజెక్షన్ ద్వారా ఈ టీకాను ఇస్తారు. తప్పనిసరిగా రెండు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు ఇచ్చిన 28 రోజులకు రెండో డోసు ఇస్తారు.
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు డీసీజీఐ అనుమతిపై సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ధన్యవాదాలు తెలిపారు. తమ శ్రమ ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వ్యాక్సిన్ తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్ తీసుకున్న శ్రమకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. భారత్‌లో తొలి కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ వినియోగానికి అనుమతి లభించింది. సురక్షితమైన, సమర్థవంతమైన ఈ టీకా రానున్న కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది
Happy new year, everyone! All the risks @SerumInstIndia took with stockpiling the vaccine, have finally paid off. COVISHIELD, India’s first COVID-19 vaccine is approved, safe, effective and ready to roll-out in the coming weeks. pic.twitter.com/TcKh4bZIKK
— Adar Poonawalla (@adarpoonawalla) January 3, 2021
భద్రత విషయంలో స్వల్పంగా ఉంటే మేము దేనినీ ఆమోదించమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వి.జి.సోమాని వెల్లడించారు. ఈ రెండు టీకాలు 110 శాతం సురక్షితం అని ప్రకటించారు. తేలికపాటి జ్వరం, నొప్పితోపాటు అలెర్జీ వంటి కొన్ని దుష్ప్రభావాలు ప్రతి టీకాకు సాధారణం అని అన్నారు.
#WATCH I We’ll never approve anything if there’s slightest of safety concern. Vaccines are 110 % safe. Some side effects like mild fever, pain & allergy are common for every vaccine. It (that people may get impotent) is absolute rubbish: VG Somani,Drug Controller General of India pic.twitter.com/ZSQ8hU8gvw
— ANI (@ANI) January 3, 2021
ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ అత్యవసర వినియోగం కోసం సిఫారసులు చేసిన 24 గంటల్లోపే..కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ రెండు వ్యాక్సిన్స్‌కు డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది.
#Serum #oxford vaccine gets DCGI emergency use approval. What do we know about the vaccine? https://t.co/AU7JkGWo2I
— Quint Fit (@QuintFit) January 3, 2021
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు.. భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన ఆమోదం తెలపాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది నిపుణుల కమిటీ.
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. కోవిడ్ నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు టీకాను ప్రజలకు అందుబాటులోకి కేంద్రం తీసుకొచ్చింది. టీకా వినియోగం, అనుమతుల విషయంపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక ప్రకటన చేసింది. కొవిషీల్డ్‌తో పాటు కొవాగ్జిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కొవిడ్ నిరోధానికి దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. కొవాగ్జిన్ టీకా సామర్థ్యం, భద్రత ఇప్పటికే నిరూపితమైనట్లు వెల్లడించింది. ఐసీఎంఆర్, పుణె ఎన్‌ఐవీ సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌ను రూపొందించింది. అలాగే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కూడా డీసీజీఐ ఆమోద ముద్ర వేసింది.
#WATCH live via ANI FB: Drugs Controller General of India briefs the media on COVID-19 vaccine. https://t.co/3mo97GEPcV
— ANI (@ANI) January 3, 2021
కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు డీసీజీఐ నుంచి అనుమతి లభించింది. ఈ రెండు టీకాలను సీడీఎస్‌సీవో సిఫారసు చేసిందని తెలిపింది. అత్యవసర వినియోగానికి షరతులతో అనుమతి ఇచ్చినట్లుగా వెల్లడించింది.
#WATCH: Drugs Controller General of India briefs the media on COVID-19 vaccine. https://t.co/0PhAeVzOgC
— ANI (@ANI) January 3, 2021
కొవాగ్జిన్‌కు షరతులతో కూడిన ఆమోదం తెలపాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది నిపుణుల కమిటీ.. ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ అత్యవసర వినియోగం కోసం సిఫారసులు చేసిన 24 గంటల్లోపే..కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ భావించింది
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు..భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది.
మొన్న.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎక్స్‌పర్ట్స్ కమిటీ.. కోవాగ్జిన్‌పై మరింత అదనపు సమాచారం కావాలని.. భారత్ బయోటెక్‌ను కోరింది. నిన్న ఆ సమాచారాన్ని పరిశీలించిన కమిటీ.. సంతృప్తి చెంది.. ఎమర్జెన్సీ యూసేజ్‌కు ఓకే చెప్పేసింది. నిపుణుల కమిటీ సిఫార్సుపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా – డీసీజీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీసీజీఐ ఆమోదిస్తే.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలుకానుంది.