DC Vs SRH: వరుసగా మూడో ఓటమి నమోదు చేసిన హైదరాబాద్‌.. ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం..

|

May 06, 2022 | 12:00 AM

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్(SRH), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది...

DC Vs SRH: వరుసగా మూడో ఓటమి నమోదు చేసిన హైదరాబాద్‌.. ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం..
Dc
Follow us on

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో భాగంగా ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్(SRH), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్​రైజర్స్‌ను ఓపెనర్లు నిరాశపరిచారు. అభిషేక్‌ శర్మ 7 పరుగులు, విలియమ్సన్ 4 పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన రాహుల్‌ త్రిపాఠి 22 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. దీంతో మర్‌క్రమ్, పూరన్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టిన మర్‌క్రమ్ క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పూరన్​62 పరుగులతో చేలరేగి ఆడినా ఫలితం దక్కలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ 2, నోర్జే, మిచెల్ మార్ష్, కుల్దీప్ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్‌ వార్నర్ 58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. రోమన్‌ పొవెల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. ఢిల్లీ మిగతా బ్యాటర్లలో రిషభ్ పంత్ 26 పరుగులు చేయగా.. మిచెల్‌ మార్ష్‌ 10, మన్‌దీప్‌ సింగ్ 0 డకౌట్‌ అయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, సీన్‌ అబాట్, శ్రేయాస్‌ గోపాల్ తలో వికెట్ తీశారు.

Read Also.. IPL 2022: సన్‌రైజర్స్ జట్టులోకి మరో లెఫ్టార్మ్‌ పేసర్‌.. ధోనితో ఎలాంటి అనుబంధం ఉందో తెలుసా?