అలా ఉన్న శిల్పాను చూసి నవ్వు ఆపుకోలేకపోయా..

| Edited By:

Jun 13, 2020 | 4:16 PM

కరోనా లాక్‌డౌన్‌తో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులే కాకుండా క్రికెటర్లు కూడా ఉన్నారు. దీంతో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అందులోనూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ని...

అలా ఉన్న శిల్పాను చూసి నవ్వు ఆపుకోలేకపోయా..
Follow us on

కరోనా లాక్‌డౌన్‌తో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులే కాకుండా క్రికెటర్లు కూడా ఉన్నారు. దీంతో చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. అందులోనూ టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ని మరింత ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే టిక్‌టాక్ వీడియోలు చేస్తూ దుమ్మురేపుతున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. అటు శిల్పాశెట్టి కూడా టిక్‌టాక్‌లో పలు వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి చేసిన ఓ టిక్‌టాక్‌ వీడియని చూసి.. డేవిడ్ వార్నర్ నవ్వు ఆపుకోలేకపోయారట. టిక్‌టాక్‌లోని ఫేస్ ఫిల్టర్ సాయంతో హాస్యాస్పదంగా ఓ వోకల్ సాంగ్‌ను పాడిన వీడియోను షేర్ చేసింది శిల్ప. ఆమెను చూసిన వార్నర్ కూడా అదే విధంగా చేయాలని ప్రయత్నం చేశాడట. అయితే ఎంత ప్రయత్నించినా అలా రాకపోవడం వల్ల నవ్వును ఆపుకోలేకపోయాడు వార్నర్. ‘ఈ వీడియో నన్ను బాగా నవ్వించేలా చేసింది శిల్పా’.. అని క్యాప్షన్ పెట్టి ఆమె వీడియోకు తన వీడియోను కలిపి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు వార్నర్.

Read more: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. రంగం సిద్ధం