అమెరికాలోని ఆ ప్రాంతాల్లో.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు..!

దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెంటిగ్రేడ్ (122 ఎఫ్) కు చేరుకోవచ్చని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యుఎస్) తెలిపింది. లాస్ వెగాస్ నగరంతో సహా ఉటా, అరిజోనా, నెవాడా

అమెరికాలోని ఆ ప్రాంతాల్లో.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు..!

Edited By:

Updated on: Aug 01, 2020 | 8:16 PM

Dangerous Heat Wave Forecast: దక్షిణ కాలిఫోర్నియాలో శనివారం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీ సెంటిగ్రేడ్ (122 ఎఫ్) కు చేరుకోవచ్చని నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యుఎస్) తెలిపింది. లాస్ వెగాస్ నగరంతో సహా ఉటా, అరిజోనా, నెవాడా ప్రాంతాల్లో కూడా 49 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు కూడా వీస్తాయని పేర్కొంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని, తగు భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. అధిక పీడన వ్యవస్థ నైరుతి గుండా కదులుతున్నదని, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.

ఆరిజోనాలోని ఫీనిక్స్ లో శుక్రవారం అత్యధికంగా 46 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయింది. కాలిఫోర్నియాలోని నాలుగు నగరాల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరిజోనాలోని చాలా ప్రాంతాల్లో సోమవారం వరకు అరుదైన, ప్రమాదకరమైన ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని నేషనల్ వెదర్ సర్వీస్ ట్విట్టర్ లో పేర్కొంది.

[svt-event date=”01/08/2020,6:23PM” class=”svt-cd-green” ]

Read More:

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ