మళ్లీ మిస్సయ్యారు.. మంగీ ఫారెస్ట్ లో కూంబింగ్

|

Jul 15, 2020 | 2:21 PM

Cumbing in The Mangi Forest : అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో మావోయిస్టుల కదలికలు మరోసారి ఊపందుకున్నాయి. చాాలా కాలం తర్వాత.. కొమరం భీం జిల్లాలో మళ్లీ అలజడి మొదలైంది. తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు మావోయిస్టులు తారసపడ్డారు. మంగీ, తిర్యాణి, పెంబి ఏజెన్సీ ప్రాంతంలోకి మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. టోకీగడూలో కూంబింగ్ చేస్తుండగా.. ముగ్గురు మావోయిస్టులు […]

మళ్లీ మిస్సయ్యారు.. మంగీ ఫారెస్ట్ లో కూంబింగ్
Follow us on

Cumbing in The Mangi Forest : అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్‌లో మావోయిస్టుల కదలికలు మరోసారి ఊపందుకున్నాయి. చాాలా కాలం తర్వాత.. కొమరం భీం జిల్లాలో మళ్లీ అలజడి మొదలైంది. తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా ముగ్గురు మావోయిస్టులు తారసపడ్డారు.

మంగీ, తిర్యాణి, పెంబి ఏజెన్సీ ప్రాంతంలోకి మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడి చేరుకున్నారు. టోకీగడూలో కూంబింగ్ చేస్తుండగా.. ముగ్గురు మావోయిస్టులు ఎదురుపడ్డారు. పోలీసులను చూసిన మావోయిస్టులు పారిపోయారు. ఇందులో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ మైలరపు అడిల్లు అలియస్ భాస్కర్ మరోసారి తప్పించుకున్నారు.

వీరిలో భాస్కర్ తోపాటు వర్గేష్, బండి ప్రకాశ్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మంగి అడవిలో రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు తప్పించుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.