ఏపీ కేబినెట్‌పై భేటీపై అదే సస్పెన్స్..

| Edited By:

May 13, 2019 | 1:34 PM

రేపటి ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కావాల్సిన ఏపీ కేబినెట్‌కి ఎలక్షన్ కమిషన్ ఇంకా క్లియరెన్స్ రాలేదు. బహుశా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మరికాసేపట్లో భేటీ కాబోతుండటం హాట్ టాపిగ్గా మారింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా ఏపీ కేబినెట్ భేటీ అజెండాపై చర్చ జరగనుందని సమాచారం. ఈ నెల 14న జరగాల్సిన […]

ఏపీ కేబినెట్‌పై భేటీపై అదే సస్పెన్స్..
Follow us on

రేపటి ఏపీ కేబినెట్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ కావాల్సిన ఏపీ కేబినెట్‌కి ఎలక్షన్ కమిషన్ ఇంకా క్లియరెన్స్ రాలేదు. బహుశా ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మరికాసేపట్లో భేటీ కాబోతుండటం హాట్ టాపిగ్గా మారింది. వీరిద్దరి మధ్య ప్రధానంగా ఏపీ కేబినెట్ భేటీ అజెండాపై చర్చ జరగనుందని సమాచారం.

ఈ నెల 14న జరగాల్సిన ఏపీ కేబినెట్ ఎజెండాలోని అంశాల్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదానికి పంపించారు. ఎజెండాలోని అంశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆమోదించింది. ఆయా అంశాలను సీఈసీ ఆమోదం నిమిత్తం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలక్రిష్ణ ద్వివేదికి పంపించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆ ఎజెండా కాపీని ఢిల్లీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‌కు పంపించారు ద్వివేది. అయితే ఈ సాయంత్రానికి ఢిల్లీ నుంచి ఆమోదం లభించవచ్చని భావిస్తున్నారు. సీఈసీ నుంచి ఆమోదం లభిస్తే రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.