కేబినేట్‌కు ఈసీ పర్మిషన్ ఇస్తుందా..?

| Edited By:

May 13, 2019 | 1:08 PM

ఏపీలో జరగాల్సిన కేబినెట్ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సోమవారం సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దాదాపు గంటసేపు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదే వీరి చర్చల ప్రధాన ఎజెండా. కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి.. ఇంకా అనుమతి రాలేదని సీఎంకు సుబ్రమణ్యం వివరించారు. మరోవైపు.. ఈసీ నుంచి అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం […]

కేబినేట్‌కు ఈసీ పర్మిషన్ ఇస్తుందా..?
Follow us on

ఏపీలో జరగాల్సిన కేబినెట్ సమావేశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సోమవారం సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం దాదాపు గంటసేపు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదే వీరి చర్చల ప్రధాన ఎజెండా.

కేబినెట్ సమావేశానికి ఈసీ నుంచి.. ఇంకా అనుమతి రాలేదని సీఎంకు సుబ్రమణ్యం వివరించారు. మరోవైపు.. ఈసీ నుంచి అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా.. కరువు, ఫొని తుఫాన్, తాగునీటిపై సమీక్ష సీఎస్ సహా ముఖ్య కార్యదర్శులతో సీఎం చర్చలు జరిపారు.