దళితులపై పెరుగుతున్న నేరాల సంఖ్య

| Edited By: Pardhasaradhi Peri

Sep 13, 2020 | 11:45 AM

2009 నుంచి 2018 మధ్య కాలంలో దేశంలో దళితులపై నేరాల సంఖ్య 6 శాతం పెరిగిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం 1989 అమలులో..

దళితులపై పెరుగుతున్న నేరాల సంఖ్య
Follow us on

2009 నుంచి 2018 మధ్య కాలంలో దేశంలో దళితులపై నేరాల సంఖ్య 6 శాతం పెరిగిందని తాజా లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం 1989 అమలులో అనేక అంతరాలు కనిపిస్తున్నాయని తేలింది. నేషనల్ దళిత్ మూమెంట్ ఫర్ జస్టిస్ (ఎన్‌డిఎంజె) – నేషనల్ క్యాంపెయిన్ ఫర్ జస్టిస్ సంయుక్తంగా ‘క్వెస్ట్ ఫర్ జస్టిస్’ పేరుతో ఈ నివేదిక తయారు చేశాయి. 2009 – 2018 మధ్యన మొత్తంగా 72,367 నేరాలు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. దళిత, ఆదివాసీ మహిళలపై హింస పెరగడాన్ని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టే సమయంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసేటప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని సదరు నివేదిక హైలైట్ చేసింది. అంతేకాదు, ఇలా దళితులు చేసిన ఫిర్యాదులకు సంబంధించి పెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. దళిత మహిళలు తరచుగా ఆధిపత్య కులాల చేతిలో భౌతిక, లైంగిక హింసను అనుభవిస్తున్నారని సదరు నివేదిక వెల్లడించింది.