ఢిల్లీలో 9 నెలల తరువాత మొదటి సారిగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 96 కేసులు నమోదయ్యాయి. 212 మంది రోగులు కోలుకోగా 9 మంది మృతి చెందారు. వరుసగా మూడు కోవిడ్ వేవ్ లను ఎదుర్కొన్న ఈ నగరం ఇప్పుడు 100 కన్నా తక్కువ కేసులను నమోదు చేసుకోవడం విశేషమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి., ఏప్రిల్ 30 న ఇక్కడ 76 కేసులు మాత్రం రిజిస్టర్ అయ్యాయి. నిన్న ఒక్కరోజున 30 వేల కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. ఇటీవలి వారాల్లో పాజిటివ్ రేటు కూడా తగ్గుతూ వఛ్చినట్టు ఈ వర్గాలు వివరించాయి. లోగడ ఒక్క రోజులోనే 8,500 కేసులు నమోదైన విషయాన్ని ఇవి గుర్తు చేశాయి. ఇప్పటివరకు మొత్తం 6,34,325 కేసులు నమోదయ్యాయి. 6.2 లక్షల మంది కోలుకున్నారు. ఇక ఇండియా మొత్తం మీద కూడా కరోనా వైరస్ కేసులు గతంతో పోలిస్తే చాలావరకు తగ్గుముఖం పట్టినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 997 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,222 మంది.
Read More:కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో 952 కొత్త కేసులు.. ముగ్గురు మృతి.. కోలుకున్న 1,602 మంది.