Court Sent Notice To Tamannaah And Kohli: నటి తమన్నా, క్రికెట్ విరాట్ కోహ్లికి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసీడర్లుగా ఉన్నందుకే కోర్టు వీరికి నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్ వేదిక రమ్మీ ఆట బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఆటపై నిషేధం విధించాలని కోరుతూ త్రిస్సూర్‌కు చెందిన పాలీ వర్గీస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఆటలపై నిషేధం విధించారని త్రిస్సూర్ కోర్టుకు తెలిపారు. అంతటితో ఆగకుండా.. ఇలాంటి ఆటలకు బడా స్టార్లు బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తుండడం వల్లే.. ప్రజలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ రమ్మీపై నిషేధాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీంతో ఈ విషయంపై స్పందించిన కేరళ హైకోర్టు విరాట్ కోహ్లీ, తమన్నాలతో పాటు కేరళలో ఈ ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న మరో మలయాళీ నటుడు అజు వర్గీస్‌లకు నోటీసులు జారీ చేసింది. మరి కోర్టు ఇచ్చిన నోటీసులపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి.