Covishield Trademark: కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ పై ‘క్యుటిస్’ పిటిషన్ కి పూణే కోర్టు తిరస్కృతి, సీరందే ఆమార్క్

కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ తమదని, దీన్ని సీరం కంపెనీ వినియోగించుకోజాలదని క్యుటిస్ బయోటెక్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ని పూణే కోర్టు తిరస్కరించింది..

Covishield Trademark: కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ పై క్యుటిస్ పిటిషన్ కి పూణే కోర్టు తిరస్కృతి, సీరందే  ఆమార్క్

Edited By:

Updated on: Jan 31, 2021 | 10:53 AM

కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ తమదని, దీన్ని సీరం కంపెనీ వినియోగించుకోజాలదని క్యుటిస్ బయోటెక్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ని పూణే కోర్టు తిరస్కరించింది. ఈ ఇంజంక్షన్ దరఖాస్తును తోసిపుచ్చింది. తమ కంపెనీలు రెండూ వేర్వేరు ప్రాడక్ట్స్ కేటగిరీలను ఆపరేట్ చేస్తున్నాయని, కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ పై అయోమయం అనవసరమని సీరం సంస్థ లాయర్ హితేష్ జైన్ కోర్టుకు తెలిపారు. క్యుటిస్ అప్లికేషన్ ని న్యాయమూర్తి ఏవీ రోట్ తిరస్కరించారు, ఈ ట్రేడ్ మార్క్ ని క్యూటీస్ వినియోగించుకోకుండా ఉత్తర్వులిచ్చారు అని ఆయన వెల్లడించారు. అటు-క్యుటిస్ కంపెనీ చాలావరకు మెటీరియల్ ఫాక్ట్స్ ని తొక్కిపెట్టిందని (దాచిపెట్టిందని) కోర్టు అభిప్రాయపడింది. ఈ సంస్థ దాఖలు చేసిన పత్రాల్లో ‘క్లారిటీ’ లేదని జడ్జ్ వ్యాఖ్యానించారు.

అయితే కోర్టు ఆర్డర్స్ తమకు అందలేదని, ఏమైనా.. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు చేస్తామని క్యుటిస్ బయోటెక్ తరఫు న్యాయవాది ఆదిత్య సోని తెలిపారు. వాషింగ్ పౌడర్లు, తదితరాలను ఉత్పత్తి చేసే ఈ సంస్థ కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ తమదేనని, కొన్ని సంవత్సరాలుగా తాము దీన్ని వినియోగించుకుంటున్నామని  లోగడ ప్రకటించుకుంది. ఫ్రూట్ వెజిటబుల్ వాష్, యాంటీ సెప్టిక్ డిస్ ఇన్ఫెక్టెన్ట్ లిక్విడ్ ఫస్ట్ ఎయిడ్ వంటి వాటిని ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.  కోవిషీల్డ్ ట్రేడ్ మార్క్ తమదేనన్న ఈ సంస్థ వాదనను కోర్టు తిరస్కరించింది.  సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి, భారత్ బయో టెక్ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ కి ప్రభుత్వం గత నెలలో అనుమతించిన విషయం గమనార్హం.

Read More:

Coronavirus in India Update: భారత్ లో నిలకడగా సాగుతున్న కొత్త కరోనా కేసుల నమోదు.. గత 24గంటల్లో 13,965 పాజిటివ్ కేసులు

Motorcycle Crushed Into Pieces: ట్రైన్ వస్తున్నా బైక్ మీద పట్టాలు దాటడానికి ప్రయత్నించిన యువకుడు.. ఆపై

సినిమా షూటింగ్ సెట్‏లో సేఫ్‏గా ఉన్నట్లు అనిపించలేదు.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన ప్రియాంక చోప్రా..