కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!

| Edited By:

Jul 29, 2020 | 3:01 PM

శ్రావణ మాసం శుభకార్యాలకు ప్రతీతి. ఈ మాసంలో వేలాది వివాహాలు జరుగుతుంటాయి. ఈ కరోనా కాలంలో పెళ్లి చేయాలంటే సవాలక్ష ఆంక్షలు.. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. బంధుమిత్రుల సమక్షంలో

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!
Follow us on

Coronavirus test: శ్రావణ మాసం శుభకార్యాలకు ప్రతీతి. ఈ మాసంలో వేలాది వివాహాలు జరుగుతుంటాయి. ఈ కరోనా కాలంలో పెళ్లి చేయాలంటే సవాలక్ష ఆంక్షలు.. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. బంధుమిత్రుల సమక్షంలో సందడిగా జరుపుకునే పెళ్లిళ్లను కొద్దిమందితోనే కానిచ్చేస్తున్నారు. ఫలితంగా పదులు, వందల సంఖ్యలోనే ఈ శ్రావణంలో చాలామంది తటపటాయిస్తూనే ముహూర్తాలను పెట్టుకుంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.

కరోనా ఆంక్షల నేపథ్యంలో.. ఎక్కువ మందిని పిలిచే అవకాశం లేక.. అతిథుల జాబితాను కుదిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఏకంగా పెళ్లికి వచ్చేవారు కరోనా టెస్టు చేయించుకుని ఆ రిపోర్టును తహసీల్దార్‌కు ఇవాల్సిన పరిస్థితి ఉంది. తహసీల్దార్‌ ఓకే అంటేనే పెళ్లికి వెళ్లేది. ఇలా వచ్చే వారంతా కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఎలా అని అటు ఆహ్వానించే వారు, ఇటు ఆహ్వానితులు తలలు పట్టుకుంటున్నారు. పెళ్లికి వచ్చేవారు ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్న నిబంధన కూడా కొన్నిచోట్ల ఇబ్బందిపెడుతోంది.

Also Read: కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన