గుడ్ న్యూస్.. ఏపీలో 8 లక్షలు దాటిన రికవరీ కేసులు..

Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఇందులో 21,438 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,05,026 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 10 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,744కు చేరుకుంది. ఇక నిన్న 2,701 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు […]

గుడ్ న్యూస్.. ఏపీలో 8 లక్షలు దాటిన రికవరీ కేసులు..

Updated on: Nov 04, 2020 | 6:28 PM

Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,33,208కి చేరింది. ఇందులో 21,438 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,05,026 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 10 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,744కు చేరుకుంది. ఇక నిన్న 2,701 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 52, చిత్తూరు 321, తూర్పుగోదావరి 424, గుంటూరు 323, కడప 127, కృష్ణా 332, కర్నూలు 35, నెల్లూరు 94, ప్రకాశం 70, శ్రీకాకుళం 117, విశాఖపట్నం 122, విజయనగరం 85, పశ్చిమ గోదావరి 375 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,207కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 788 మంది కరోనాతో మరణించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us