ఏపీలో తగ్గుతోన్న కరోనా కేసులు… కొత్తగా ఎన్నంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,886 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,20,565కి చేరింది.

ఏపీలో తగ్గుతోన్న కరోనా కేసులు... కొత్తగా ఎన్నంటే.!

Updated on: Oct 30, 2020 | 5:36 PM

Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,886 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,20,565కి చేరింది. ఇందులో 25,514 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,88,375 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 17 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,676కు చేరుకుంది. ఇక నిన్న 3,623 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 151, చిత్తూరు 296, తూర్పుగోదావరి 405, గుంటూరు 385, కడప 148, కృష్ణా 448, కర్నూలు 36, నెల్లూరు 80, ప్రకాశం 146, శ్రీకాకుళం 77, విశాఖపట్నం 152, విజయనగరం 69, పశ్చిమ గోదావరి 493 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,373కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 778 మంది కరోనాతో మరణించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us