కరోనా అప్డేట్: కోలుకున్నవారు 53,239.. యాక్టివ్ కేసులు 21,417

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఇందులో 21,417 యాక్టివ్ కేసులు ఉండగా.. 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1136 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా […]

కరోనా అప్డేట్: కోలుకున్నవారు 53,239.. యాక్టివ్ కేసులు 21,417

Updated on: Aug 07, 2020 | 9:26 AM

Coronavirus Positive Cases In Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఇందులో 21,417 యాక్టివ్ కేసులు ఉండగా.. 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1136 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 601కి చేరింది.

ఇక నిన్న ఒక్క రోజే 23,495 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 5,66,984కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 532, రంగారెడ్డిలో 196, వరంగల్ అర్బన్ 142, మేడ్చల్ 136, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, గద్వాల్ 87, కామారెడ్డి 96, కరీంనగర్ 93, ఖమ్మం 85, నిజామాబాద్ 89, పెద్దపల్లి 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పల్లెల్లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే జరిమానా!

కోవిడ్ ఇన్ఫెక్షన్లు ఆరు రకాలు.. ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త.!

జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి కాలేజీలు ఓపెన్..

Loading...
Unable to load recommendations.
Follow Us