కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..

|

Mar 29, 2020 | 11:13 AM

Coronavirus: భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఆఖరి ఓవర్‌లో ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను కట్టడి చేసి ఇండియాకు అపూర్వమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌ అయిన జోగిందర్ శర్మ.. కొంతకాలానికి జట్టులో చోటు కోల్పోయి 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఇక తాజాగా అతడిపై ఐసీసీ ఓ ట్వీట్ చేసింది. అది కాస్తా సోషల్ […]

కరోనాపై యుద్ధం.. పోలీస్‌గా మారిన క్రికెటర్.. ఐసీసీ సెల్యూట్..
Follow us on

Coronavirus: భారత మాజీ క్రికెటర్ జోగిందర్ శర్మ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఆఖరి ఓవర్‌లో ప్రత్యర్ధి పాకిస్తాన్‌ను కట్టడి చేసి ఇండియాకు అపూర్వమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌ అయిన జోగిందర్ శర్మ.. కొంతకాలానికి జట్టులో చోటు కోల్పోయి 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఇక తాజాగా అతడిపై ఐసీసీ ఓ ట్వీట్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రిటైరయ్యాక జోగిందర్ శర్మ హర్యానాలో డిప్యూటీ సూప‌రిటిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం దేశమంతా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న వేళ.. అతడు జనాల్లో అవగాహన పెంచుతూ ఎనలేని సేవలు చేస్తున్నాడు. ఇదే విషయాన్ని తెలుపుతూ ఐసీసీ జోగిందర్ ఫోటోను షేర్ చేసి.. ‘రియల్ హీరో’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో జోగిందర్ పోలీసు అధికారిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నట్లు కొనియాడింది. ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ కాగా.. నెటిజన్లు ఈ క్రికెటర్‌పై ప్రశంసలు కురిపించారు.

Read This: దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…