కరోనా దెబ్బకు తహశీల్దార్ కార్యాలయం మూసివేత

|

Jul 02, 2020 | 6:54 PM

తాజాగా రాజమండ్రీలోని గంగవరం తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని వెంటనే స్థానిక క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేశారు.

కరోనా దెబ్బకు తహశీల్దార్ కార్యాలయం మూసివేత
Follow us on

కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. నెలల తరబడి లాక్ డౌన్ విధించినప్పటికీ చాపకింద నీరు విస్తరిస్తూనే ఉంది. ఇంతకాలం పట్టాణాలకే పరిమితమైన వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా రాజమండ్రీలోని గంగవరం తహశీల్దారు కార్యాలయంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో అతన్ని వెంటనే స్థానిక క్వారంటైన్ కేంద్రానికి తరలించారు అధికారులు. అటు, తహశీల్దార్ కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేయాలని సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయ పరిసరాలను పూర్తిగా శానిటైజేషన్ చేసిన అనంతరం మళ్లీ తెరుస్తామని అధికారులు వెల్లడించారు. అయితే, కరోనా సోకిన వ్యక్తిని కాంటాక్ట్ అయిన వారి వివరాలను ఆరోగ్య అధికారులు సేకరిస్తున్నారు.