Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,593 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,51,298కి చేరింది. ఇందులో 20,262 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,24,189 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 10 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,847కు చేరుకుంది. ఇక నిన్న 2,178 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 90.21 సాంపిల్స్‌ను పరీక్షించారు….
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 105, చిత్తూరు 225, తూర్పుగోదావరి 259, గుంటూరు 202, కడప 43, కృష్ణా 202, కర్నూలు 45, నెల్లూరు 93, ప్రకాశం 51, శ్రీకాకుళం 58, విశాఖపట్నం 80, విజయనగరం 42, పశ్చిమ గోదావరి 188 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,20,050కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 805 మంది కరోనాతో మరణించారు.
Also Read:
మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగటివ్.. కాలం, కరోనా నన్ను కన్ఫ్యూజ్ చేశాయంటూ ట్వీట్..
పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.!
రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. వివరాలివే..!
ఏపీ: సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ గడువు పొడిగింపు..
కూతురు పుట్టింది.. అదృష్టాన్ని తెచ్చింది.. మురిసిపోతున్న యువ పేసర్ నటరాజన్..