Corona World: కరోనా ప్రపంచ అప్డేట్.. ఒక్క రోజులో 7,17,264 పాజిటివ్ కేసులు, 12,385 మరణాలు నమోదు..

|

Dec 19, 2020 | 6:31 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు..

Corona World: కరోనా ప్రపంచ అప్డేట్.. ఒక్క రోజులో 7,17,264 పాజిటివ్ కేసులు, 12,385 మరణాలు నమోదు..
Follow us on

Coronavirus Cases World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూపోతోంది. నిన్న ఒక్క రోజు 7,17,264 పాజిటివ్ కేసులు, 12,385 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76,133,030కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,683,907 మంది కరోనాతో మరణించారు. ఇక 53,405,910 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 17,888,353కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 320,845 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్ దాటింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10,005,850 పాజిటివ్ కేసుల కేసులు నమోదు కాగా.. 145,178 మంది వైరస్ కారణంగా మరణించారు.

Also Read:

సాధారణ రైళ్ల రాకపోకల తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.? కీలక ప్రకటన చేసిన రైల్వే శాఖ.!!

నా కెరీర్‌కు బిగ్ బాస్ వల్ల ఎలాంటి ఉపయోగం జరగలేదు.. వైరల్ అవుతున్న పునర్నవి షాకింగ్ కామెంట్స్..

డేటింగ్ యాప్ మాయ.. కిలాడీ యువతుల నగ్న వీడియో కాల్.. అసలు కథంతా అప్పుడే జరిగింది.?

తెలంగాణలో స్కూళ్లు ప్రారంభమయ్యేది అప్పుడే.!! మూడు నెలలు తరగతులు.? పూర్తి వివరాలివే..