ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్క రోజులో 443 పాజిటివ్ కేసులు…

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 443 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్క రోజులో 443 పాజిటివ్ కేసులు...

Updated on: Jun 22, 2020 | 4:48 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 443 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందినా కేసులు 392 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 51గా ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7,451కి చేరింది. ఇందులో 3,903 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,437 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 111 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు గడిచిన 24 గంటల్లో కరోనాతో ఐదుగురు మరణించగా.. 83 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అనంతపురం 70, చిత్తూర్ 29, ఈస్ట్ గోదావరి 64, గుంటూరు 34, కడప 42, కృష్ణ 15, కర్నూల్ 60, నెల్లూరు 6, ప్రకాశం 7, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 5, విజయనగరం 6, వెస్ట్ గోదావరిలో 54 కేసులు నమోదయ్యాయి.