America tested #covidindia vaccine on 43 years old woman: భూమండలాన్ని మొత్తం వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19)కు వాక్సిన్ వచ్చేసింది. దీన్ని తొలి ట్రయల్‌గా ఓ మహిళపై ప్రయోగించింది అగ్ర రాజ్యం అమెరికా. సియాటిల్‌కు చెందిన 43 ఏళ్ళ మహిళ హాల్లెర్‌పై తొలి వాక్సిన్‌ను తొలిసారి ప్రయోగించామని అమెరికా ప్రకటించింది. అదే మహిళకు రెండో ఇంజెక్షన్ కూడా ఇచ్చామని తెలిపింది. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా హాల్లెర్‌కు రెండు ఇంజెక్షన్లు చేశారు. సియాటిల్‌కు చెందిన జెన్నిఫర్ హాల్లెర్‌కు ఇద్దరు పిల్లలున్నారు.
మార్చి 16వ తేదీన కరోనా వాక్సిన్‌ను ప్రయోగాత్మకంగా వినియోగించామని, సియాటిల్‌లోని కైజర్ పెర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఈ ప్రయోగం జరిగిందని అమెరికా వివరించింది. పూర్తిగా ఆరోగ్యంగా వున్న మొత్తం 45 మందిని సియాటిల్ ప్రయోగశాల ఎంపిక చేసుకోగా వారిలో జెన్నిఫర్ హాల్లెర్ ఒకరు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఈ ప్రయోగాలకు సారథ్యం వహిస్తోంది.
A long-awaited study in healthy people testing a potential vaccine against the new coronavirus is underway in Seattle. Read and watch exclusive @AP coverage: https://t.co/6eWnjsMgJ9 pic.twitter.com/vs3EmsKSjs
— AP Health & Science (@APHealthScience) March 16, 2020
కరోనా వైరస్ వాక్సిన్‌ను తొలిసారి తీసుకున్న జెన్నీఫర్ హాల్లెర్… కరోనాపై ప్రపంచం ఏమీ చేయలేక చతికిలా పడిన సందర్భంలో తనకు ఈ అవకాశం దక్కడం ఆనందంగా వుందని వెల్లడించింది. తొలి రెండు ఇంజెక్షన్లను స్వీకరించిన హాల్లెర్.. ఆ తర్వాత ఫలితాల ప్రయోగంలోను భాగస్వామిగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.
తనకు ఫేస్ బుక్ ద్వారా ఈ ప్రయోగం గురించి తెలిసిందని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారికోసం ప్రభుత్వం వెతుకుతోందని తెలిసి తనకు తానుగా క్లినికల్ ట్రయల్స్‌కు వచ్చానని హాల్లెర్ వెల్లడించింది.
ఎంఆర్ఎన్ఏ-1273 (mRNA-1273) పేరుతో రూపొందించిన కరోనా వైరస్ వాక్సిన్ ఈ భయంకర వైరస్‌ను పూర్తిగా నిర్మూలిస్తుందని ప్రస్తుతం ప్రయోగశాలలో ప్రతీ ఒక్కరు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ వాక్సిన్ ప్రాథమిక దశలో విజయవంతమైతే.. తరువాతి దశలో అమెరికా, చైనా, దక్షిణ కొరియాలలో ప్రయోగించి చూస్తామని లాబొరేటరీ నిర్వాహకులు చెబుతున్నారు.