వలస కార్మికులకు కరోనా.. ఆందోళనలో రాష్ట్రాలు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే.. తెలంగాణలో తొలిసారి ముగ్గురు వలస కార్మికులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

వలస కార్మికులకు కరోనా.. ఆందోళనలో రాష్ట్రాలు..

Edited By:

Updated on: May 08, 2020 | 12:09 PM

Migrant labour: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ పొడిగించిన విషయం విదితమే. అయితే.. తెలంగాణలో తొలిసారి ముగ్గురు వలస కార్మికులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. లాక్‌డౌన్ నిబంధనలకు కొన్ని సడలింపులు ఇచ్చారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ముంబై నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. వీరు యాదాద్రి జిల్లాకు చెందిన కార్మికులుగా అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు.. కోవిద్-19 టెస్టులు చేయకుండా ఎవరిని రాష్ట్రంలోకి అనుమతించడంలేదు.రెండు రోజుల క్రితం వరకు కేవలం జిహెచ్‌ఎంసి పరిధిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆకస్మాత్తుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారి నుంచి కరోనా కేసులు రావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని ఖచ్చితంగా ఇంక్యూబేషన్ పీరియడ్ వరకు క్వారంటైన్‌లో ఉంచుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: కర్నూలులో టెన్షన్.. ఒకే కుటుంబంలో ఏకంగా ఐదుగురికి కరోనా..