ఒక్కరోజులో 10,601 మందికి పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. అయితే ఈ రోజు మాత్రం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్కరోజులో పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  70,993 నమూనాలను పరీక్షించగా 10,601 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మ‌ృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. 

ఒక్కరోజులో 10,601 మందికి పాజిటివ్

Updated on: Sep 08, 2020 | 7:07 PM

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. అయితే ఈ రోజు మాత్రం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్కరోజులో పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  70,993 నమూనాలను పరీక్షించగా 10,601 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మ‌ృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది.

దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,17,094కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 73 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. గుంటూరు జిల్లాలో 10 మంది, అనంతపురం 8, చిత్తూరు 8, కడప 7, ప్రకాశం 7, నెల్లూరు 6, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 5, కృష్ణా 5, పశ్చిమగోదావరి 5, శ్రీకాకుళం 3, కర్నూలు 2, విజయనగరం జిల్లాలో ఒకరు మరణించారు.

తాజా వివరాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 4,560కి చేరింది. మరోవైపు ఇప్పటి వరకు 42,37,070 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,769 యాక్టివ్‌ కేసులున్నట్లు తెలిపింది.