ఏపీలో కొత్తగా 479 పాజిటివ్ కేసులు, 4 మరణాలు.. క్రమక్రమంగా తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 62,215 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 479 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఏపీలో కొత్తగా 479 పాజిటివ్ కేసులు, 4 మరణాలు.. క్రమక్రమంగా తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..
Corona Andhra Pradesh

Updated on: Dec 19, 2020 | 6:11 PM

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 62,215 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 479 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,78,285కి చేరింది. ఇందులో 4355 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,66,856 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా నలుగురు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 7074కు చేరుకుంది. ఇక నిన్న 497 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,11,96,574 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 13, చిత్తూరు 87, తూర్పుగోదావరి 47, గుంటూరు 62, కడప 23, కృష్ణా 92, కర్నూలు 26, నెల్లూరు 16, ప్రకాశం 21, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 47, విజయనగరం 13, పశ్చిమ గోదావరి 22 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us